ఐపీఎల్ లో ధోనికి వందో విజయం
మరో ఆఖరి బాల్ ఉత్కంఠ విజయానికి మొహాలీ వేదికయింది.
ఐపీఎల్ సీజన్ 12లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్ధి రాజస్థాన్ రాయల్స్ పై చివరి
బంతి సిక్సర్ తో విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ
సీజన్లో రెండో అర్ధ సెంచరీ కొట్టాడు. అంతకు ముందే అర్ధసెంచరీ పూర్తి చేసిన అంబటి
రాయుడు(57) అవుటయ్యాడు. ఐపీఎల్లో ధోని కెప్టెన్ గా చెన్నైకిది వందో విజయం. తొలుత
బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 151/7 చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో
చెన్నై 155/6 వికెట్లను కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్ బౌలింగ్లో
రవీంద్ర జడేజా తొలి బంతికే సిక్స్ సాధించాడు. 12 పరుగుల్ని చేయాల్సిన దశలో నోబాల్
పడింది. ఆ బాల్ కు ఒక పరుగు, ఫ్రీ హిట్ బాల్ కు మరో రెండు పరుగులు లభించాయి. ఆ
తర్వాత స్టోక్స్ అద్భుతమైన యార్కర్ కు ధోని అవుట్ కావడంతో చివరి మూడు బంతుల్లో 8
పరుగుల్ని రాజస్థాన్ రాయల్స్ చేయాల్సి వచ్చింది. తర్వాత వైడ్ బాల్ పడగా ఆ తర్వాత
బంతికి శాంటనర్ రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా
బ్రహ్మాండమైన స్ట్రెయిట్ సిక్సర్ కొట్టిన శాంటనర్ చెన్నై ఖాతాలో మరో గెలుపును జమ
చేశాడు.
No comments:
Post a Comment