రష్యా
యువతిని వేధించిన కేసులో మహారాష్ట్ర యువకుడి అరెస్ట్
భారత్ పర్యటనకు వచ్చిన ఓ రష్యా యువతిని వేధించిన 19ఏళ్ల కుర్రాడిని ఆదివారం(మే26)
మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర గోవాలోని నగోవా గ్రామానికి వచ్చిపోతుండే
అశ్పక్ ముజావర్ అనే యువకుడి మే15న అక్కడ ఓ రష్యా యువతి వెంటపడి దౌర్జన్యానికి
పాల్పడ్డాడు. ఆమె అతణ్ని నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను
తనను వేధించడంతో పాటు చెంపదెబ్బ కొట్టాడని ఆమె వివరించినా పోలీసులు ఎటువంటి చర్యలు
తీసుకోలేదు. దర్యాప్తు జరిపేందుకు వారు నిరాకరించారు. జరిగిన దౌర్జన్యానికి
సంబంధించిన వీడియో ఆమె వద్ద ఉండడంతో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ
వీడియో వైరల్ కావడంతో మహారాష్ట్ర పోలీసులు గుర్తించి అతణ్ని అదుపులోకి
తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.