గాజువాకలో కరోనా కలకలం
విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో మంగళవారం కరోనా కలకలం చెలరేగింది. ఇక్కడ కుంచుమాంబ ఆలయం సమీపంలోని మాంసం దుకాణదారు కరోనా బారిన పడ్డాడు. అతను గత మూడ్రోజులుగా సుమారు 600 మంది వినియోగదారులకు మాంసం విక్రయించాడు. ప్రస్తుతం అతను కరోనా పాజిటివ్ అని తేలడంతో మాంసం కొనుగోలు చేసిన వారంతా హడలిపోతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతానంతా అధికారులు దిగ్బంధనం చేశారు. అతని వద్ద ఆదివారం నుంచి మంగళవారం వరకు మాంసం కొనుగోలు చేసిన వ్యక్తులు ఇప్పటికే స్వచ్ఛందంగా కరోనా పరీక్షలకు ఆసుపత్రికి తరలివచ్చారు. 11 మంది కరోనా పరీక్షల కోసం రాగా మిగిలిన వారు వెంటనే తరలిరావాలని అధికారులు కోరుతున్నారు.