అడవి ఏనుగు
దాడిలో మహిళ నాల్గేళ్ల కొడుకు మృతి
ఛత్తీస్
గఢ్ లోని అడవిలో ఏనుగు దాడిలో ఓ మహిళ సహా ఆమె నాల్గేళ్ల కొడుకు మృతి చెందారు. ఈ
ఘటన శుక్రవారం రాత్రి పొద్దుపోయాక చోటుచేసుకుంది. బలరామ్ పూర్ జిల్లాలోని సెవరి
గ్రామ పరిధిలో ఈ భారీ ఏనుగు దాడి చేసింది. సరోజ్ తికిరి(35), వివేక్ తికిరి(4) ఏనుగు
దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు రాజ్ పూర్ అటవీ సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్.డి.ఒ) కె.ఎస్.కుతియా
శనివారం వివరాలు తెలిపారు. ఏనుగు దాడిలో ఇంకా శాంతిసంజె తికిరి(59), అమర్ మణి
తికిరి(58) కూడా తీవ్రగాయాల పాలయ్యారన్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు
సమాచారం. ఏనుగు తల్లీకొడుకుపై దాడి చేస్తుండగా కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరూ
కూడా గాయపడ్డారని కుతియా తెలిపారు.