ప్రధాని మోదీ, మంత్రి రిజిజుల్ని కలిసిన పీవీ సింధు
స్విట్జర్లాండ్
(బాసెల్)లో ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని సాధించిన
తొలి భారతీయ షట్లర్ గా చరిత్ర సృష్టించిన పీవీ సింధు ప్రధాని మోదీ, క్రీడల శాఖ మంత్రి
కిరణ్ రిజిజుల్ని కలుసుకుంది. కోచ్ లు పి.గోపీచంద్, కిమ్ జి హ్యూన్, తండ్రి పి.వి.రమణలతో
కలిసి ఆమె మంగళవారం ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ
సింధూ సాధించిన ఘనత యావత్ భారతదేశానికి గర్వకారణమన్నారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ
ప్రపంచ చాంపియన్ షిప్ లో తొలి స్వర్ణాన్ని సాధించడం ద్వారా సింధు దేశానికి కీర్తిని
తీసుకువచ్చిందని..ఆమెను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ లో ఆమె మరిన్ని విజయాల్ని
సాధించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి రిజిజు ఆమెకు ఈ సందర్భంగా రూ.10 లక్షల నగదు
ప్రోత్సాహకాన్ని (చెక్) అందించారు.