సుప్రీంకోర్టులో మోదీ బయోపిక్ పై 15న వాదనలు
ప్రధాని ‘మోదీ జీవిత చరిత్ర’ సినిమా విడుదల్ని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)
నిషేధించడంపై ఈనెల 15న వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సార్వత్రిక
ఎన్నికల వేళ మోదీ బయోపిక్ విడుదల చేయరాదని ఈసీఐ నిషేధం విధించింది. ఈ సినిమా
నిర్మాతలు ఈసీఐ నిర్ణయాన్ని సడలించాలించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో
భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం వాదనలు వినేందుకు అంగీకారం
తెల్పింది. అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్త మోదీ బయోపిక్ విడుదలపై స్టే విధించాలని
కోరుతూ వేసిన పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. సినిమా విడుదల కావాలా లేదా అనేది
ఈసీఐ పరిధిలోని అంశంగా ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే సెన్సార్ బోర్డు ఇప్పటికే
సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతో కాంగ్రెస్ కార్యకర్త ఈ
విషయాన్ని తెల్పుతూ సినిమా విడుదల నిలిపివేయాలని ఈసీఐని కోరడంతో నిషేధం
విధించింది.
No comments:
Post a Comment