ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో
ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య పెరిగింది. చివరి రోజు శనివారం దక్కిన రెండు
పతకాలతో కలిపి మొత్తం ఏడు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. నీరజ్ చోప్రా జావెలిన్ లో బంగారు
పతకం గెలుచుకోగా భజరంగ్ కు కాంస్యం లభించింది. 100 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్ లో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించి నీరజ్ చరిత్ర సృష్టించాడు. దాంతో ఈసారి ఒలింపిక్స్ లో
భారత్ కు 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు దక్కాయి.
మీరాబాయి చాను, రవి దహియాలు రజతాలు
గెలుచుకోగా, తెలుగు తేజం షట్లర్
పీవీ సింధు, లవ్లీనా, భారత పురుషుల హాకీ
టీమ్ లకు కాంస్య పతకాలు లభించాయి. మరో మూడు నాలుగు పతకాలు త్రుటిలో చేజారిపోయాయి
గానీ లేదంటే ఈ ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య రెండంకెల స్కోరు దాటి ఉండేది.
Saturday, August 7, 2021
India stands 47th position at Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు 47వ స్థానం
Subscribe to:
Posts (Atom)