జులై 16,17ల్లో పాక్షిక చంద్రగహణం
ఆకాశంలో అద్భుతాల్ని తిలకించే ఆసక్తిపరులకు మరో రోజు
వ్యవధిలో సంభవించనున్న పాక్షిక చంద్రగ్రహణం వీక్షించే అవకాశం వచ్చింది. జులై 16, 17
తేదీల్లో బుధవారం మధ్యరాత్రి 1.31 నుంచి 4.29 గంటల వరకు ఈ పాక్షిక చంద్రగ్రహణం సంభవించనున్నట్లు
బిర్లా ప్లానిటోరియం రిసెర్చ్ అండ్ అకడమిక్ డైరెక్టర్ దేబిప్రసాద్ దౌరి తెలిపారు. 3
గంటల సమయానికి చంద్రుడు పూర్తిగా కనుమరుగవుతాడు. సూర్యుడు, చంద్రులకు మధ్యలోకి భూమి
రావడంతో ఈ పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది. దేశంలో అన్ని ప్రాంతాల వారు ఈ
చంద్రగ్రహణాన్ని తిలకించొచ్చు. మళ్లీ 2021 వరకు చంద్రగ్రహణాలు సంభవించే అవకాశం
లేదు. 2021 మే 26న మళ్లీ చంద్రగ్రహణం సంభవించనుంది. ప్రస్తుత పాక్షిక చంద్రగ్రహణాన్ని
ఎటువంటి కళ్లద్దాలు లేకుండా నేరుగా తిలకించొచ్చని దౌరి తెలిపారు. దక్షిణ అమెరికా, యూరప్,
ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ చంద్రగ్రహణ దృశ్యాలు
కనిపించనున్నాయన్నారు.