రాముడు నేపాలీ: ప్రధాని ఓలి
భారత్ పై మరోసారి నేపాల్ ప్రధాని కె.పి.ఓలి విషం
కక్కారు. ఈసారి ఏకంగా రాముడ్ని అడ్డం పెట్టుకుని ఆయన మనదేశాన్ని ఆడిపోసుకున్నారు.
భారత్ లోని రామజన్మభూమిగా పేర్కొంటున్న అయోధ్య నకిలీదన్నారు. మన దేశం సాంస్కృతిక
దోపిడీకి పాల్పడుతోందని విమర్శలు రువ్వారు. సోమవారం ఆయన నేపాల్ పార్లమెంట్
సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఈ తెంపరితనాన్ని ప్రదర్శించారు. అసలైన రామజన్మభూమి
నేపాల్ లోనే ఉందని చెప్పారు. బీర్గంజ్ జిల్లాలోని థోరి శ్రీరాముని జన్మస్థలమని ఓలి
పేర్కొన్నారు. సుదీర్ఘకాలం భారత్ కు మిత్రదేశంగా కొనసాగుతున్న నేపాల్..ఓలీ ప్రధానిగా పదవిలోకి వచ్చాక చైనా కన్నుసన్నల్లో నడుస్తూ మనదేశంతో శత్రుత్వం పెట్టుకుంటోంది.
లిపులేఖ్, కాలాపానీ,
లింపియాధుర ప్రాంతాల్ని ఇటీవల తమ మేప్ లో చేర్చుకుని తమవే ఆ
భూభాగాలంటూ నేపాల్ కయ్యానికి కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే.