ఆంధ్రప్రదేశ్
లో 80% ఓట్ల పోలింగ్?
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మునుపెన్నడూ లేని రీతిలో ఉద్రిక్తతలు,
ఘర్షణల మధ్య గురువారం ముగిసింది. అర్ధరాత్రి వరకు కూడా అనేక ప్రాంతాల్లో పోలింగ్
నిర్వహించారు. ఈవీఎంలు మొరాయించడంతో ఆళ్లగడ్డ లో అర్ధరాత్రి వరకూ ఎన్నిక
నిర్వహించారు. మొత్తమ్మీద 2014 కంటే 2019 ఎన్నికల ఓటింగ్ శాతం పెరిగినట్లు
తెలుస్తోంది. ఇక మళ్లీ సీఎం కుర్చీ చంద్రబాబుదేనని కొందరు, ఈసారి ఛాన్స్ తమదేనని జగన్
అభిమానులు ఎవరి లెక్కల్లో వారున్నారు. ఫలితాలు వెల్లడికి మాత్రం మే 23 వరకు వేచి
ఉండక తప్పదు. ఈ లోపు పందెం రాయుళ్లు బరిలోకి దిగడం ఖాయం.
అత్యధిక శాతం పోలింగ్:సీఈవో ద్వివేదీ
ఈసారి రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ లో అత్యధిక శాతం
ఓటింగ్ నమోదైనట్లు ఏపీ సీఈవో ద్వివేదీ తెలిపారు. మరికొన్ని గంటల్లో అధికారికంగా
ఓటింగ్ శాతం వివరాలు వెల్లడిస్తామన్నారు. 80% ఓట్లు పోలయినట్లు
అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన చోట్ల రీపోలింగ్, లేదా ఓటు వేయని
వారుంటే వారికి పోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఏర్పాట్లు చేస్తామని వివరించారు.
No comments:
Post a Comment