చిదంబరాన్ని తీహార్ జైలుకు వెళ్లి
కలిసిన గులాంనబీ, అహ్మద్ పటేల్
తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి చిదంబరాన్ని బుధవారం కాంగ్రెస్
సీనియర్ నాయకులు గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్, చిదంబరం తనయుడు కార్తీలు కలిశారు.
ఐ.ఎన్.ఎక్స్. మీడియా ముడుపుల కేసులో చిదంబరం అరెస్టయి సెప్టెంబర్ 5 నుంచి తీహార్
జైలులో ఉన్నారు. సోమవారమే చిదంబరం 74వ పుట్టినరోజు జరుపుకున్నారు. చిదంబరం సంపూర్ణ
ఆరోగ్యంతో ఉన్నారని జైలు ప్రధాన ఆవరణలో ఆయనను కలిసినట్లు గులాంనబీ తెలిపారు. అర్ధగంట
సేపు చిదంబరంతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్ లు తాజా
రాజకీయ పరిణామాల్ని ఆయనతో చర్చించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, రానున్న ఆయా
రాష్ట్రాల ఎన్నికలు, జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిమాణాలపై కాంగ్రెస్ సీనియర్
నాయకుల త్రయం చర్చించినట్లు తెలుస్తోంది.