కేసీఆర్ పై రాములమ్మ వ్యంగ్యోక్తులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తాజాగా బీజేపీలో చేరిన రాములమ్మ (విజయశాంతి) వ్యంగ్యోక్తులు విసిరారు. కేసీఆర్ ను మించిన మహానటుడు లేరన్నారు. కేసీఆర్ కన్నా ముందే తాను తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు విజయశాంతి చెప్పారు. ఉద్యమం కోసమే `తల్లి తెలంగాణ పార్టీ`ని టీఆర్ఎస్‌లో విలీనం చేశానన్నారు. మెదక్ ఎంపీగా ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన సంగతి గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని రాములమ్మ ఆరోపించారు.