తండ్రి
అంత్యక్రియల కోసం హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్
ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్ల శనివారం మధ్యరాత్రి హైదరాబాద్ వచ్చారు. ఆయన తండ్రి ప్రఖ్యాత మాజీ ఐఏఎస్
అధికారి యుగంధర్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక విమానంలో లండన్ నుంచి
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. పీవీ నరసింహారావు హయాంలో పీఎంఓలో యుగంధర్
సెక్రటరీగా పనిచేశారు. 1962 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన 2004_2009 వరకు ప్రణాళికా సంఘం సభ్యునిగా విధులు నిర్వర్తించారు.
ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి ఎన్.ఎ.ఎ. అకాడెమీ డైరెక్టర్ గా (1988_93) బాధ్యతలు వహించారు. ఐఏఎస్ అధికారిగా పలు కీలక
బాధ్యతలు చేపట్టిన యుగంధర్(82) ఈనెల13న పరమపదించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆదివారం జుబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు.