ప్రియాంక జీ.. మీకు
మే23 తర్వాత తెలుస్తుంది
కాంగ్రెస్
యువనేత ప్రియాంక గాంధీపై భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎదురుదాడికి దిగారు.
మంగళవారం (మే7) హర్యానాలోని అంబాలాలో ప్రియాంక ఎన్నికల ప్రచార సభలో మోదీ
అహంకారాన్ని దుర్యోధనుడి అహంకారంతో పోలుస్తూ వ్యాఖ్యానించిన కొన్ని క్షణాల్లోనే బీజేపీ
నాయకులు, శ్రేణులు ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. అధ్యక్షుడు
అమిత్ షా అయితే ఒకడుగు ముందుకు వేసి మే 23 తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చాక మీకు
తెలుస్తుందంటూ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ లోని బెల్దా ఎన్నికల ప్రచారంలో
పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ ‘ప్రియాంక జీ.. ప్రధాని మోదీని దుర్యోధనుడితో
పోల్చారు.. ఆయన చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు వారే మీకు గుణపాఠం చెబుతారు..’అని గట్టిగా బదులిచ్చారు. మోదీ
అర్జునుడని 2019 ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.