మే 28 నుంచి మళ్లీ కల్యాణమస్తు!
తిరుమలలో మళ్లీ కల్యాణమస్తు
కార్యక్రమానికి ముహూర్తం ఖరారయింది. దాదాపు దశాబ్దం తర్వాత తిరుమల తిరుపతి
దేవస్థానం (టీటీడీ) మళ్లీ ఈ కార్యక్రమం ప్రారంభించదలిచింది. దేశవ్యాప్తంగా కల్యాణమస్తు
పేరిట సామూహిక వివాహాల్ని టీటీడీ నిర్వహించనుంది.
ఈ ఏడాది మే 28 మధ్యాహ్నం 12.34 నుంచి 12:40 వరకు, అక్టోబర్ 30 ఉదయం 11:04 నుంచి 11:08 వరకు, నవంబర్ 17 ఉదయం 9:56 నుంచి 10.02 వరకు
కల్యాణమస్తు ముహూర్తాలు ఖరారు చేశారు. పాలకమండలిలో చర్చించి పెళ్లిళ్ల వేదికలను
నిర్ణయిస్తామని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు.
కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా వివాహం చేసుకున్న వారికి మంగళసూత్రం, నూతన వస్త్రాలు, 40 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామన్నారు.