తెలంగాణలో పీఆర్సీ పండుగ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం అసెంబ్లీలో చేసిన ప్రకటనతో పండుగ వాతావరణం నెలకొంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్ దారుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సీఎం ముందు హామీ ఇచ్చినట్లుగానే మున్నెన్నడు లేని రీతిలో ఫిట్మెంట్ ను 30 శాతం పెంచారు. అదే విధంగా ఉద్యోగ విరమణ వయోపరిమితిని 3 ఏళ్లకు పెంచుతూ 61ఏళ్లుగా నిర్ణయించారు. ఇది కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపజేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఓయూ విద్యార్థులు మాత్రం 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి గురించి కేసీఆర్ సర్కార్ ను డిమాండ్ చేశారు.