హిమాచల్ బస్ ప్రమాదంలో 10 మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో శనివారం(ఏప్రిల్27)
రాత్రి జరిగిన ఘోర బస్ ప్రమాదంలో 10 దుర్మరణం చెందగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాత్రి 7 గంటల సమయంలో ప్రయివేటు బస్ దల్హౌసి- పటాన్ కోట్ రోడ్డులో ప్రయాణిస్తూ అదుపుతప్పి 200 అడుగుల లోయలోకి జారిపోయింది.
మృతుల్లో ముగ్గురు మహిళలున్నట్లు ఎస్.పి. మోనికా భూటాన్గురు తెలిపారు. దల్హౌసి
కంటోన్మెంట్ కు చెందిన ఆర్మీ సహాయక బృందాలు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాయి. గాయపడిన
వారందర్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. ఆర్మీ వెంటనే
రంగంలోకి దిగడంతో మృతుల సంఖ్య మరింత పెరగకుండా నివారించగల్గినట్లు కల్నల్ ఆనంద్ చెప్పారు.
ఘటనపై రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల
బంధువులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.