డ్రోన్లతో కరోనాపై దండయాత్ర
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగర మునిసిపల్ అధికారుల వినూత్న రీతిలో కరోనాపై యుద్ధభేరి మోగించారు. భవానీపురం పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో మున్సిపల్ సిబ్బంది డ్రోన్ లతో హైపో క్లోరైడ్ అనే యాంటీ కరోనా వైరస్ మందును ఇళ్లపై చల్లారు. కరోనా ప్రబలకుండా అడ్డుకునే చర్యల్లో భాగంగా మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతీ వీధిలో డ్రోన్ల సహాయంతో నివాసాలపై ఈ మందు పిచికారీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.