శ్రీలంకపై కివీస్ అలవోక విజయం
కార్డిఫ్
వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్ నం.3లో శనివారం కివీస్ జట్టు ఆడుతూ పాడుతూ శ్రీలంకపై
గెలిచేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ విలయమ్సన్ శ్రీలంకను బ్యాటింగ్ కు
ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కూడా మరో టీ20
మ్యాచ్ నే తలపించింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే అర్ధ సెంచరీ(52 నాటౌట్) మినహా ఏ
బ్యాట్స్ మన్ క్రీజ్ లో కుదురుకోలేదు. తిసార పెరీరా (27పరుగులు) మాత్రమే కాస్తంత కెప్టెన్
కు బాసటగా నిలిచాడు. ఫర్గుసన్, మాట్ హెన్నీలు చెరి మూడు వికెట్లు పడగొట్టారు. భారత్
ఉపఖండానికి చెందిన పాక్ జట్టు శుక్రవారం 105 పరుగులకే అలౌట్ కాగా ఈరోజు శ్రీలంక
జట్టు కూడా 29.3 ఓవర్లలో 136 పరుగులకే బ్యాట్ ఎత్తేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో
ఎటువంటి తడబాటు లేకుండా కివీస్ ఓపెనర్లు గుప్తిల్(73 నాటౌట్), కొలిన్ మున్రో(58
నాటౌట్) చెరో అర్ధసెంచరీలు కొట్టారు. 16.1 ఓవర్లలోనే 137 పరుగులు చేసి జట్టుకు 10
వికెట్ల విజయాన్ని అందించారు.
ఆసిస్ పై చెప్పుకోదగ్గ స్కోరు చేసిన అఫ్ఘానిస్థాన్ (207 ఆలౌట్)
ఆస్ట్రేలియాతో
శనివారం బ్రిస్టోల్ లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ నం.4లో టాస్ గెలిచిన
అప్ఘానిస్థాన్ కెప్టెన్ గుల్బుద్దీన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆదిలో అయిదు
వికెట్లు త్వరత్వరగా పడిపోయిన నజీబుల్లా జర్దాన్ తో కలిసి గుల్బుద్దీన్ ఇన్నింగ్స్
ను చక్కదిద్దాడు. ఇద్దరూ క్రీజ్ నిలిచి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాక బ్యాట్
ఝళిపించారు. ముఖ్యంగా అప్పటికే రెండు వికెట్లు తీసిన స్పినర్ జంపాను నజీబుల్లా ఓ ఆట ఆడుకున్నాడు.
అతని ఓవర్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓవర్ లో ఇదే క్రమంలో
ఒక అనవసరమైన షాట్ కొట్టి కెప్టెన్ గుల్బుద్దీన్ 31 పరుగులు చేసి అవుటయ్యాడు.
నజీబుల్లా అర్ధ సెంచరీ (51), రహ్మత్ షా 43 పరుగులు, దూకుడుగా ఆడిన రషీద్ ఖాన్ 27
పరుగులు చేసి జట్టు చెప్పుకోదగ్గ స్కోరు 207 (ఆలౌట్) పరుగులు సాధించేందుకు
తోడ్పడ్డారు.