పవన్ కల్యాణ్ బక్రీద్ శుభాకాంక్షలు
జనసేన అధినేత పవర్ స్టార్
పవన్ కల్యాణ్ ముస్లింలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగ నిరతికి ప్రతీక
బక్రీద్ అని గుర్తు చేశారు. బక్రీద్‌కు మరో పేరే ఈద్-ఉల్-అజహా అని ఆయన అన్నారు. ఈ
మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రంజాన్ తరవాత ముస్లింలు
అంత పవిత్రంగా జరుపుకునే పండుగ బక్రీద్ అన్నారు. ఇస్లాంను సంపూర్ణంగా విశ్వసించే
ముస్లింలు అందరికీ తన తరఫున, జనసేన పార్టీ నుంచి బక్రీద్ శుభాకాంక్షలు అని పవర్ స్టార్ ప్రకటించారు.
బక్రీద్ అందించిన సందేశం ముస్లింలకు మాత్రమే కాక యావత్ మానవాళికి ఆచరణీయం అని ఈ
సందర్భంగా తెలిపారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఈ పండుగను సంప్రదాయబద్ధంగా,
నిరాడంబరంగా భౌతికదూరం పాటిస్తూ ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని
కోరారు.