ఆస్ట్రేలియాలో పెంపుడు లేడి దాడిలో భర్త మృతి భార్యకు గాయాలు
ఆస్ట్రేలియాలోని
మెల్బోర్న్ కు 200 కి.మీ. దూరంలోగల వంగరట్టా గ్రామంలో
బుధవారం(ఏప్రిల్17)ఉదయం పెంపుడు లేడి దాడిలో భర్త మృతి
చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. భర్త లేడికి ఆహారం అందిస్తుండగా కొమ్ములతో
కుమ్మేసింది. ఘటనను చూసి అతనికి సహాయంగా భార్య వచ్చింది. దాంతో ఆమె పైనా లేడి
దాడికి దిగింది. భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యను ఆసుపత్రికి తరలించారు.
ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసు సార్జంట్ పాల్ పర్సెల్ విలేకర్లకు
తెలిపారు. భార్య,భర్తల వయసు 46 కాగా
వీరికి 10 ఏళ్ల కొడుకున్నాడు. లేడి తల్లి పైనా దాడి
చేస్తుండడం చూసిన కొడుకు రక్షించడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. సమీపంలోని
కర్రతో ఎదురుదాడికి దిగి ఆ లేడి నుంచి తల్లిని రక్షించినట్లు సమాచారం. ఇటువంటి
పెంపుడి జంతువుల దాడిలో మనుషులు చనిపోయిన, గాయపడిన ఘటనలు
ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో జరగలేదని తెలిసింది. ఈ సీజన్ లో ఎద సమయం కావడంతో లేడి
విపరీతమైన కోపోద్రిక్తలకు గురికావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు
జంతుశాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
No comments:
Post a Comment