సీఎం పోలవరం పనుల సమీక్ష
· ఏపీ ఎన్నికల ఫలితాలపై చింతలేదన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం
(ఏప్రిల్17) పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. వేసవి కావడంతో
తాగునీటి సరఫరాపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన
ఎన్నికలకు సంబంధించి ఫలితాలపై తనకు చింతే లేదని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల
సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫలితాలు రావడానికి మే 23 వరకు చాలా సమయం ఉంది..
ప్రస్తుతం తన దృష్టంతా ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడ్డం..అభివృద్ధి పైనే
ఉందని తెలిపారు. 2014 జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాను.. ఫలితాలు
వచ్చే వరకు ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత తనదేనన్నారు. కొత్త విధానపర నిర్ణయాలు
మినహా సాధారణ పరిపాలన సమర్ధంగా కొనసాగించాల్సి ఉందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు
అయిదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పేర్కొంటూ సీఎం ఇప్పటికే 69 శాతం పనులు
పూర్తి చేశామని గత 45 రోజులుగా పనులు కొంత నెమ్మదించినట్లు తెలిపారు. కేంద్ర
ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.4,508 కోట్లు రీయింబర్స్ మెంట్
మొత్తం అందాల్సి ఉందన్నారు. తాగు నీటి ఎద్దడి నివారించేందుకు ఆయా ప్రాంతాల్లో
3,494 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకోసం
రూ.184కోట్లు వ్యయం చేస్తున్నామన్నారు.
No comments:
Post a Comment