స్టాండ్ బై ఆటగాళ్లగా ఎంపికైన రాయుడు, పంత్, సైనీ
వరల్డ్ కప్-2019 టీమ్ ఇండియా స్టాండ్ బై ఆటగాళ్లగా యువ
క్రికెటర్లు అంబటి రాయుడు, రిషబ్ పంత్, నవదీప్ సైనీలను ఎంపిక చేసినట్లు బీసీసీఐ
ప్రకటించింది. ఇటీవల ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కక బాధతో
రగిలిపోతున్న ఈ యువ ఆటగాళ్లకు బీసీసీఐ ప్రకటన ఒకింత ఉపశమనం కల్గిస్తుంది. అయితే భారత
జట్టు ఆటగాళ్లు ఎవరైన గాయపడి అత్యవసరమైతేనే వీరికి ఆడేందుకు పిలుపు వస్తుంది. రాయుడు,
పంత్ తొలి స్టాండ్ బైలుగా సైనీ రెండో స్టాండ్ బై జాబితాలో ఉంటారని బీసీసీఐ వర్గాలు
తెలిపాయి. రాయుడు ఎంపిక కాకపోవడాన్ని మాజీ స్టార్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్
ప్రశ్నించగా, పంత్ కు చోటు దక్కకపోవడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం
వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నెట్ బౌలర్లగా సేవలందించేందుకు ఖలీల్, అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ లు
జట్టుతో పాటు ఇంగ్లండ్ టూర్ కు వెళ్లనున్నారు. మే12 వరకూ ఐపీఎల్ మ్యాచ్ లు
జరుగుతున్నందున టీమ్ ఇండియాకు యోయో పరీక్షలు ఉండబోవని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
No comments:
Post a Comment