Sunday, April 14, 2019

ipl2019 rcb at last registered a win in season12 against kings punjab

ఆర్ సీ బీ గెలిచింది..!
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడు వారాలుగా ఎదురుచూస్తున్న విజయం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సీబీ)కి దక్కింది. మొహాలీలో ఐపీఎల్ మ్యాచ్ నం.28 కింగ్స్ లెవన్ పంజాబ్ పై ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆర్ సీబీ గెలుపునందుకుంది. కెప్టెన్ కోహ్లీ(67), వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఏబీడివిలియర్స్(59) లు అర్ధసెంచరీలు నమోదు చేయగా నాల్గో నంబర్ బ్యాట్స్ మన్ స్టాయినిస్ (28) పరుగుల అండతో సునాయాసంగా గెలిచి పాయింట్ల పట్టికలో తొలిసారిగా రెండు పాయింట్లను తన ఖాతాలో నమోదు చేసుకుంది. టాస్ గెలిచిన ఆర్ సీబీ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 173/4 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్ సీబీ కేవలం ఓపెనర్ల వికెట్లనే కోల్పోయి 174/2 పరుగులు చేసి గెలుపొందింది. టోర్నీలో వరుసగా ఆరు మ్యాచ్ లను చేజార్చుకున్న ఆర్ సీబీ ఎట్టకేలకు విజయాన్ని సాధించి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగల్గింది.
గేల్ సెంచరీ మిస్
ఐపీఎల్ చరిత్రలోనే 175 పరుగుల్ని(2013లో పుణెపై) చేసిన ఏకైక బ్యాట్స్ మన్ యూనివర్స్ బాస్ కింగ్స్ పంజాబ్ కు చెందిన క్రిస్ గేల్ ఈ 12వ సీజన్లో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయాడు. ఈ మ్యాచ్ లో కేవలం 64 బంతుల్లోనే 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

No comments:

Post a Comment