Sunday, April 14, 2019

ram gopal varma shocking twist chief minister chandrababu naidu joins ysrcp


ఆర్ జీవీ తేనెతుట్ట నుంచి మరోరాయి

రామ్ గోపాల్ వర్మ.. ఆర్ జీవీ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. సంచలనాల దర్శక,నిర్మాత.. అంతకు మించి వివాదాలకు రారాజు.. ఆయన ట్వీట్లు రేపే కల్లోలం అంతా ఇంతా కాదు.. ఇదిగో ఏపీలో ఇలా..ఎన్నికలు ముగిశాయో లేదో.. ట్విటర్ లో మార్ఫింగ్ ఫొటోతో వివాదానికి తెరతీశారు. కుర్చీ మాదంటే మాదని ఎవరి ధీమాలో వారుండగా.. వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకున్న సీఎం చంద్రబాబు ఆ పార్టీలో జగన్ సమక్షంలో చేరినట్లు నకిలీ ఫొటోను పోస్టు చేశారు.
 షాకింగ్ ట్విస్ట్: ఇప్పుడే వైసీపీలో చేరిన సీబీఎన్! అంటూ రామ్ గోపాల్ వర్మ కామెంట్ రాశారు.


ipl2019 rcb at last registered a win in season12 against kings punjab

ఆర్ సీ బీ గెలిచింది..!
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడు వారాలుగా ఎదురుచూస్తున్న విజయం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సీబీ)కి దక్కింది. మొహాలీలో ఐపీఎల్ మ్యాచ్ నం.28 కింగ్స్ లెవన్ పంజాబ్ పై ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆర్ సీబీ గెలుపునందుకుంది. కెప్టెన్ కోహ్లీ(67), వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఏబీడివిలియర్స్(59) లు అర్ధసెంచరీలు నమోదు చేయగా నాల్గో నంబర్ బ్యాట్స్ మన్ స్టాయినిస్ (28) పరుగుల అండతో సునాయాసంగా గెలిచి పాయింట్ల పట్టికలో తొలిసారిగా రెండు పాయింట్లను తన ఖాతాలో నమోదు చేసుకుంది. టాస్ గెలిచిన ఆర్ సీబీ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 173/4 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్ సీబీ కేవలం ఓపెనర్ల వికెట్లనే కోల్పోయి 174/2 పరుగులు చేసి గెలుపొందింది. టోర్నీలో వరుసగా ఆరు మ్యాచ్ లను చేజార్చుకున్న ఆర్ సీబీ ఎట్టకేలకు విజయాన్ని సాధించి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగల్గింది.
గేల్ సెంచరీ మిస్
ఐపీఎల్ చరిత్రలోనే 175 పరుగుల్ని(2013లో పుణెపై) చేసిన ఏకైక బ్యాట్స్ మన్ యూనివర్స్ బాస్ కింగ్స్ పంజాబ్ కు చెందిన క్రిస్ గేల్ ఈ 12వ సీజన్లో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయాడు. ఈ మ్యాచ్ లో కేవలం 64 బంతుల్లోనే 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Saturday, April 13, 2019

ipl2019 royals beat mumbai by 4 wickets in thrilling clash

చెలరేగిన జోస్ బట్లర్ ఆర్ఆర్ జట్టు గెలుపు
·  ఊపు మీదకు వచ్చిన డీకాక్, రోహిత్
·  అయినా ముంబయికి తప్పని ఓటమి
ముంబయి వాంఖేడ్ స్టేడియం జోస్ బట్లర్ జోష్ కు ఫిదా అయింది. సిక్సర్లు, ఫోర్లు వర్షం కురిపించడంతో ముంబయి ఇచ్చిన లక్ష్యం రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు ఎంతో చిన్నదిగా కనిపించింది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఆర్ఆర్ విజయం నమోదు చేసింది.
ఐపీఎల్ మ్యాచ్ నం.27లో ముంబయి ఇండియన్స్(ఎంఐ) ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) ఎదుట 188 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ముంబయి వాంఖేడ్ స్టేడియంలో శనివారం(ఏప్రిల్13) టాస్ గెలిచిన ఆర్ఆర్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎట్టకేలకు ఓపెనర్ డీకాక్(87) ఊపు మీదకు రావడం, కెప్టెన్ రోహిత్ (47)మళ్లీ చెప్పుకోదగ్గ స్కోరు చేయడంతో ముంబయి జట్టు 187/5 సాధించింది.
ఆర్ఆర్ జట్టు 188 పరుగుల లక్ష్య ఛేదనలో 9సిక్సర్లు, 19 బౌండరీలు (130 పరుగులు) సాధించడాన్ని బట్టే ఏ రీతిలో ధాటిగా ఆడిందో అర్థమౌతుంది. ఓ వైపు బౌండరీల మోత మోగించిన కెప్టెన్ అజింక రహానే 21 బంతుల్లో 37 పరుగులు చేసి వెనుదిరగ్గానే మరో ఓపెనర్ జోస్ చెలరేగిపోయి ఆడాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి జోస్ అవుటయ్యాడు. రాహుల్ చహర్ బౌలింగ్ లో సూర్యకుమార్ కు క్యాచ్ ఇచ్చాడు. రహానే క్యాచ్ ను కూడా సూర్యకుమారే అందుకున్నాడు. 60 పరుగుల వద్ద రహానే అవుటవ్వగా 147 పరుగుల వద్ద జోస్ పెవిలియన్ చేరాడు. 14 ఓవర్లు ముగిసే సరికి 155/2 స్కోరుతో ఆర్ఆర్ జట్టు విజయానికి చేరువలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత నాలుగు వికెట్లను స్వల్ప పరుగుల తేడాతో చేజార్చుకుంది. చివరి ఓవర్లలో గోపాల్ దీటుగా ఆడి జట్టును గెలిపించాడు.

sindhu surrenders before okuhara singapore open


సెమీస్ లో ఓడిన సింధు
సింగపూర్ ఓపెన్ లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. సెమీస్ లో చిరకాల ప్రత్యర్థి ఒకుహర చేతిలో సింధు ఓటమి పాలయింది. అంతకు ముందే సైనా, శ్రీకాంత్, సమీర్ వంటి టాప్ ఇండియన్ షట్లర్లు టోర్నీ నుంచి వెనుదిరిగారు. శనివారం (ఏప్రిల్13) జరిగిన మ్యాచ్లో ఒకుహర 21-7,21-11 గేమ్ ల తేడాతో ఆరో సీడ్ సింధుపై విజయం సాధించింది. మ్యాచ్ 37 నిమిషాల్లోనే ముగిసింది. 2018 ముగిసే నాటికి సింధు వరల్డ్ టూర్ టోర్నీల్లో 8 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులపై గెలిచింది.