ఆశ్చర్యకరంగా పెరిగిన ట్విటర్ ఖాతాదారులు
·
గత
ఏడాదితో పోలిస్తే 18% పెరుగుదల
·
త్రైమాసిక
ఆదాయం రూ.1,300 కోట్లు
సామాజిక మాధ్యమం ట్విటర్ ఖాతాదారుల సంఖ్య అనూహ్యంగా
పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఖాతాదారుల సంఖ్యలో పెంపుదల కనిపించింది. 2019 తొలి
త్రైమాసికంలో ఆదాయం 18 శాతం పెంపును నమోదు చేసినట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్(సీఈఓ) జాక్ డొర్సి తెలిపారు. ఆదాయం రూ.1300 కోట్లు చేకూరిందట. ఖాతాదారుల
సంఖ్య 13.40 కోట్లకు పెరిగి మొత్తంగా 33 కోట్ల 30 లక్షలకు చేరింది. అడ్వర్టయిజ్
మెంట్ ల ఆదాయం గణనీయంగా పెరగడంతో మొత్తం ఆదాయం 18 శాతం పెంపుతో రూ.67కోట్ల90లక్షల
మార్క్ ను అందుకుంది. అయితే కంపెనీ ఎనలిస్టుల అంచనా ప్రకారం ఆదాయం పెంపు నమోదు
కాలేదని తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసిక పెంపుదల రూ.77
కోట్ల నుంచి రూ.83 కోట్లు ఉండొచ్చని భావించారు. ట్విటర్ సంస్థను జాక్ డొర్సీ, నొహ్
గ్లాస్, బిజ్ స్టోన్, ఇవాన్ విలియమ్స్ లు 2006 మార్చి 21న అమెరికా కాలిఫోర్నియా (శాన్
ఫ్రాన్సిస్కో)లో ప్రారంభించారు. ఈ పదమూడేళ్లలో సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచం
నలుమూలలా విస్తరించి ఖాతాదారుల మన్ననలు చూరగొంటోంది. రోజూ 10 కోట్ల మంది యూజర్లు
34 కోట్ల ట్విట్లను చేస్తున్నారు.