ప్రేయసిని
చంపి సూట్ కేస్ లో కుక్కిన కిరాతకుడు
నమ్మిన ప్రేయసిని దారుణంగా హత్య చేసిన కిరాతకుడి ఉదంతమిది. 25 ఏళ్ల యువతి వారం
రోజులుగా కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దారుణం
వెలుగుచూసింది. మేడ్చల్ లోని ఓ డ్రెయినేజీ నుంచి యువతి మృతదేహాన్ని శనివారం
(ఏప్రిల్13) కనుగొన్నారు. ఇంజినీరింగ్ చేసిన యువతి తన సహ విద్యార్థిని
ప్రేమించింది. వీరిద్దరూ 2017 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈనెల 4న ఇద్దరూ ఉద్యోగం
కోసం మస్కట్ లో ఇంటర్వ్యూకు వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ అతను యువతిని
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని లాడ్జిలో దించాడు. ఆ తర్వాత రోజు ఆమెను చంపేసి
సూట్ కూస్ లో శవాన్ని కుక్కాడు. ఆ సూట్ కేస్ తో కొంత దూరం బస్ లో ప్రయాణించి ఆ
తర్వాత క్యాబ్ లో కి మారి మేడ్చల్ ప్రాంతానికి
చేరుకున్నాడు. అక్కడ డ్రెయినేజీలో సూట్ కేస్ ను పారేసినట్లు పోలీసులు
వివరించారు. యువతి ఫోన్ కాల్స్ ఆధారంగా హంతకుడి గుట్టురట్టయింది.