చైనాలో ఆకస్మిక వరదలు 7గురి మృతి నలుగురి గల్లంతు
చైనా దక్షిణ ప్రాంతంలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. షెన్జెన్ నగరంలో శుక్రవారం
వరదల తాకిడికి ఏడుగురు మృతి చెందగా మరో నలుగురి జాడ తెలియడం లేదు. ఆకస్మికంగా భారీ
వర్షాలు కురవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం
రాత్రి 9 గంటల నుంచి షెన్జెన్ భారీ వర్షాల తాకిడికి చివురుటాకుల వణికిపోయింది. ఎడతెగని
భారీ వర్షంతో వరద విరుచుకుపడగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లూవోహు, ఫుటియాన్
ప్రాంతాల్లో పూడికతీత పనుల్లో అలక్ష్యం వల్లే వరద పోటెత్తడానికి కారణంగా
భావిస్తున్నారు.