కోవిన్ పోర్టల్
క్రాష్!
దేశంలోని యువతకు కోవిడ్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం
ప్రారంభమైంది. 18 ఏళ్ల పైబడిన వారందరూ
అర్హులే అని కేంద్రం ప్రకటించడంతో ఎక్కువ మంది ఒకేసారి రిజిస్ట్రేషన్‌కి
ప్రయత్నించారు. దాంతో సర్వర్లు క్రాష్ అయ్యాయి. సెకండ్ వేవ్ సృష్టిస్తోన్న
భయోత్పాతంతో ఒక్కసారిగా అందరిలోనూ వేక్సినేషన్ విషయమై చురుకు పుట్టింది. ప్రపంచ
వ్యాప్తంగా ఇప్పటికి 60
కోట్ల పైచిలుకు మందికి కరోనా వ్యాక్సినేషన్ జరగ్గా అందులో 25 శాతం సుమారు 15 కోట్ల మందికి మనదేశంలో కరోనా టీకా వేశారు. భారత ప్రభుత్వం
మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ
వ్యాక్సిన్ వేయించుకునే వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఆన్‌లైన్
పోర్టల్ కోవిన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. ఇప్పటి వరకూ కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి
మాత్రమే టీకా వేస్తున్నారు. కేంద్రం తాజా నిర్ణయాలతో 18 ఏళ్ల పైబడిన యువత
పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు కోవిన్ పోర్టల్‌లో
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం పెద్దఎత్తుల లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించారు.
దాంతో లోడ్ తట్టుకోలేక సర్వర్లు క్రాష్ అయినట్లు సమాచారం.
No comments:
Post a Comment