ఉడుపి, కొల్లూర్ దేవాలయాల్ని సందర్శించిన ఇస్రో చైర్మన్
శివన్
చంద్రయాన్-2 ప్రయోగం నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)
చైర్మన్ కె.శివన్ ఉడుపిలోని శ్రీకృష్ణ మఠం, దేవాలయాల్ని భార్య మాలతి శివన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ సోమవారం ఆయన ఈ దేవాలయంలో పూజలు
నిర్వహించారు. మధ్యాహ్నం 2.30కు శ్రీకృష్ణ మఠానికి చేరుకున్న శివన్, కుటుంబ
సభ్యుల్ని విద్యాదీశాతీర్థ స్వామి మిషన్ విజయవంతం కావాలంటూ ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఇస్రో
ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-1 ప్రాజెక్టు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇస్రో రానున్న సోమవారం జులై 15 న
సతీష్ ధావన్ (శ్రీహరికోట) అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-2ను ప్రయోగించనుంది. తొలుత ఈ ఉదయం శివన్, కుటుంబ సభ్యులు కొల్లూరు
ముకాంభిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ మఠానికి వెళ్లి
స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
No comments:
Post a Comment