పులి దాడిలో లైన్
మన్ కు తీవ్రగాయాలు
మధ్యప్రదేశ్ లోని
సియొని జిల్లాలో పెద్దపులి దాడిలో రాష్ట్ర విద్యుత్ శాఖ సిబ్బంది ఒకరు తీవ్రగాయాల
పాలయ్యారు. మంగళవారం (జూన్4) జరిగిన ఈ ఘటనలో 58ఏళ్ల యశ్వంత్ బైసెన్ అనే లైన్ మన్
తీవ్రంగా గాయపడినట్లు అటవీ శాఖాధికారి రాకేశ్ కొడొపె తెలిపారు. పరస్పాని గ్రామ
సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సాయంత్రం 5 సమయంలో విద్యుత్ సిబ్బంది లైన్ మరమ్మతులు
నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈదురుగాలులకు ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో
వాటిని సరిచేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రానికి ఆనుకొని అటవీ ప్రాంతం ఉంది. సిబ్బంది
పనుల్లో నిమగ్నమై ఉండగా పొదల చాటున మాటువేసిన పులి ఒక్కసారిగా బైసెన్ పైకి
దూకింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడినా అతను అలారం మోగించడంతో మిగిలిన సిబ్బంది,
గ్రామస్థులు పెద్ద సంఖ్యలో కేకలు వేస్తూ ఘటనా స్థలానికి చేరుకోవడంతో పులి అడవిలోకి
పారిపోయింది. ఈ వారంలో ఈ ప్రాంతంలో పులి దాడి ఘటనల్లో ఇది రెండోది. 22 ఏళ్ల పంచాం
గజ్బా కూడా ఇదే ప్రాంతంలో పులి దాడిలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తాజా
ఘటనలో గాయపడిన బైసెన్ ను సమీపంలోని కురై ఆసుపత్రికి తరలించి చికిత్స
అందిస్తున్నారు.
No comments:
Post a Comment