టిప్పుసుల్తాన్ ను కొనియాడిన
పాక్ ప్రధాని ఇమ్రాన్
నాటి మైసూర్ చక్రవర్తి టిప్పు
సుల్తాన్ అసమాన పోరాట యోధుడని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్లాఘించారు. మే4
టిప్పు సుల్తాన్ వర్ధంతి. ఆయన 220వ వర్ధంతి సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఘనంగా
నివాళులర్పించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడ్డంలో టిప్పు సుల్తాన్ చూపిన
తెగువ, సాహసాలు తననెంతో ముగ్ధుణ్ని చేశాయని ట్వీట్ చేశారు. బానిసత్వానికి
వ్యతిరేకంగా పులిలా పోరాడిన టిప్పు సుల్తాన్ ను టైగర్ అని పిలిచేవారు. సాయుధ
పోరాటంలోనే కాక పరిపాలనలోనూ అనేక సంస్కరణల రూపశిల్పిగా టిప్పు సుల్తాన్ పేరు
గడించారు. నాణేల ముద్రణ, కొత్త రెవెన్యూ విధానం అమలు, మైసూర్ లో పట్టుపరిశ్రమ అభివృద్ధి తదితరాల్లో ఖ్యాతి పొందారు. గత
ఫిబ్రవరిలో భారత్-పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనూ ఇమ్రాన్ పాకిస్థాన్ పార్లమెంట్
సమావేశంలో టిప్పుసుల్తాన్ కీర్తిని కొనియాడిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment