మోదీపై మమత ఘాటు విమర్శ
పశ్చిమ బెంగాల్
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హద్దు దాటి ప్రధాని మోదీపై ఘాటు విమర్శ చేశారు. సోమవారం (మే6)
బిష్ణుపూర్ లోక్ సభ నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ
సందర్భంగా మమత మాట్లాడుతూ ప్రధాని మోదీ ఛాతీ 56 అంగుళాల నుంచి 112 అంగుళాలకు
ఉప్పొంగాలని ఆకాంక్షించారు. ఆయన కు మంచి శరీరాకృతి ఉంది..ఆయన ఛాతీ ఇంకా పెరిగితే
అందరి ఆరోగ్యం బాగుంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ చాలా జిత్తులమారి అని
ఆయన మళ్లీ మళ్లీ మరిగించి ఇచ్చిన టీ ఆరోగ్యాలకు హాని చేస్తుందన్నారు. ఆయన ఎప్పుడూ
మట్టి కప్ లో చాయ్ ఇవ్వరన్నారు. చాయ్ వాలా
కాస్తా ఇప్పుడు కాపాలాదారుడై పోయారని మమతా ఎద్దేవా చేశారు. తమ పార్టీ లౌకికతత్వం మార్గం
వీడదని ఈ సందర్భంగా ఆమె ర్యాలీలో అన్నారు. మసీదు, మందిరం, చర్చిలన్నీ తమకు
ఒక్కటేనని చెప్పారు. ఆదివారం ఎన్నికల ర్యాలీలో మోదీ టి అంటే మూడు అర్ధాలు
వస్తాయంటూ తృణమూల్..టోల్బాజి, టాక్స్ (టోల్బాజి అనే పదాన్ని స్థానికంగా బలవంతపు
వసూళ్లు, దౌర్జన్యం అనే అర్ధం లో వాడతారు) రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలన ఆ
విధంగానే సాగుతోందని విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో ప్రధానికి మమతా పై విధంగా
బదులిచ్చినట్లయింది. టీఎంసీ బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందంటున్న మోదీ.. పెద్ద
నోట్ల రద్దు సందర్భంగా ఎంత డబ్బు వెనకేసుకున్నారని మమత ప్రశ్నించారు.
No comments:
Post a Comment