ఈజిప్టు భద్రతా బలగాల కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదుల హతం
ఈజిప్టులో భద్రతా బలగాలు సోమవారం(మే20) తనిఖీలు నిర్వహిస్తుండగా
ఎదురపడిన 12 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఆదివారం ఈజిప్టు రాజధాని కైరోలోని గాజా పిరమిడ్ల
సందర్శనకు వచ్చిన విదేశీయుల లక్ష్యంగా ఉగ్రవాదులు రోడ్డు పక్కన పెట్టిన బాంబు
పేల్చడంతో బస్ లో ప్రయాణిస్తున్న 17 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. గాజా
పిరమిడ్లకు సమీపంలో నిర్మాణంలో ఉన్న పురావస్తు ప్రదర్శనశాల (మ్యూజియం) వద్ద బాంబు
పేలుడు సంభవించింది. ఆ సమయంలో బస్ లో మొత్తం 28 మంది ప్రయాణికులున్నారు. పేలుడు
వల్ల మ్యూజియం కు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పురావస్తు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈరోజు
కాల్పులో చనిపోయిన 12 మంది ఉగ్రవాదులు బాంబు పేలుడు కుట్రదారులుగా భావిస్తున్నారు.
అంతకుముందు ఈజిప్టులోని దక్షిణాఫ్రికా రాయబారి వుసి మువింబెల ఆసుపత్రిలో చికిత్స
పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు.
No comments:
Post a Comment