రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన
మోదీ సోనియా రాహుల్ ప్రియాంక
భారత మాజీ ప్రధాని
రాజీవ్ గాంధీ 28 వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మంగళవారం (మే21) ఆయనకు ఘన
నివాళులర్పించారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ రాజీవ్ గాంధీ వర్ధంతి నేపథ్యంలో
ఆయనకు ఘన నివాళులు అని పేర్కొన్నారు. యమునా నదీ తీరంలో గల వీర్ భూమి లోని రాజీవ్
సమాధిని సందర్శించి సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్, ప్రియాంక ఘన
నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సందేశంలో రాజీవ్ కు
నివాళులర్పించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ ఆరో ప్రధానిగా ఎన్నికై బాధ్యతలు
చేపట్టిన రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు పరిపాలించారు. 1991 మే 21న మధ్యంతర ఎన్నికల
ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరంబుదుర్ బహిరంగ సభకు వెళ్లిన రాజీవ్ ను.. ఎల్టీటీఈ
మానవబాంబు ద్వారా దారుణంగా హత్య చేసింది.
No comments:
Post a Comment