అబార్షన్ల బిల్లు సరళతరం
చేయాలని దక్షిణ కొరియా కోర్టు తీర్పు
దక్షిణ కొరియా రాజ్యాంగ ధర్మాసనం (కాన్ స్టిట్యూషనల్
కోర్టు) అబార్షన్ల నిషేధంపై చారిత్రక తీర్పు ఇచ్చింది. 1953 నుంచి గర్భస్థ
విచ్ఛితిపై ఆ దేశంలో నిషేధం అమలులో ఉంది. ఓఈసీడీ (ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ)
సభ్యత్వం గల 36 దేశాల్లో అబార్షన్లపై కఠినంగా నిషేధం అమలు చేస్తున్న ఏకైక దేశం
దక్షిణ కొరియా. నిషేధం అమలులో ఉన్నా 2013-2017 మధ్య దేశంలో 70 మంది అబార్షన్ల చేయించుకున్నారు. దాంతో
2017 ఫిబ్రవరిలో ఈ అంశంపై కోర్టులో
కేసు దాఖలయింది. పూర్వపరాలు పరిశీలించిన
కోర్టు గర్భం కూడా ఓ వ్యక్తి శరీరంలో భాగమేనని ఆ వ్యక్తి
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రభుత్వాలు నియంత్రించజాలవని అభిప్రాయపడ్డారు. అందువల్ల
యాంటీ అబార్షన్ బిల్లును 2020 నాటికి సరళీకరించాలని ప్రభుత్వానికి సూచించింది.
లేదంటే అబార్షన్ బిల్లు రద్దు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. దక్షిణ
కొరియాలో అత్యాచారాలు లేదా రక్త సంబంధీకుల బలవంతం వల్ల గర్భం దాలిస్తేనే అబార్షన్
కు అనుమతి ఉంది. అదే విధంగా ఆరోగ్య సమస్యల దృష్ట్యా చట్టబద్ధంగా అబార్షన్ కు అనుమతి
ఉంది. అలా కాకుండా నిషేధాన్ని ఉల్లంఘించి అబార్షన్ చేయించుకున్న మహిళకు ఏడాది
జైలు, శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ కు రెండేళ్ల శిక్షలు ఆ దేశంలో అమలు
చేస్తున్నారు. అబార్షన్ బిల్లుపై అక్కడి మహిళలు రెండు వర్గాలుగా విడిపోయారు.
కోర్టు విచారణ నేపథ్యంలో గురువారం అబార్షన్ బ్యాన్ అనుకూల, వ్యతిరేక వర్గాలు
వేర్వేరుగా నినాదాలు చేశారు.
No comments:
Post a Comment