అనంతపురం,చిత్తూరు ఎన్నికల ఘర్షణల్లో ఇద్దరి మృతి
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం,చిత్తూరు జిల్లాల ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. తాడిపత్రి అసెంబ్లీ సెగ్మంట్లోని
వీరాపురం గ్రామంలో ఓ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తడంతో
కత్తి పోట్లకు దారితీసింది. పరస్పరం వేటకొడవళ్లతో చేసుకున్న దాడిలో తెలుగుదేశం
పార్టీ కార్యకర్త సిద్ధా భాస్కరరెడ్డి, వై.ఎస్.ఆర్.సి.పి కార్యకర్త పుల్లారెడ్డి
తీవ్రంగా గాయపడ్డారు. పోలింగ్ కేంద్రం మొత్తం రక్తసిక్తమై కొన్ని గంటలపాటు పోలింగ్
నిలిచిపోయింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దర్ని అనంతపురం ఆసుపత్రికి తరలిస్తుండగా
మార్గమధ్యంలో ఒకరు మరణించారు. తమ కార్యకర్త హత్య ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అయితే
ఎం.పి జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాడిపత్రిలో
రిగ్గింగ్ కు పాల్పడుతుండగా తమ కార్యకర్తలు అడ్డుకున్నారని..దాంతో టీడీపీ కార్యకర్తలు కత్తులతో
దాడికి తెగబడినట్లు వై.ఎస్.ఆర్.సి.పి ఆరోపించింది.
No comments:
Post a Comment