Friday, December 25, 2020

Vaikuntha Ekadashi Dwara Darshanam started Tirumala

వైకుంఠాన్ని తలపిస్తున్న

తిరుమల

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం అభిషేకం అనంతరం ఆలయ ఆర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభం కాగా.. సామాన్య భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం క్యూకట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. దాంతో తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తోంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తదితరులు ఉన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వారంలో నడవటం స్వర్గంలో నడిచినట్లుందన్నారు. 2021లో అందరి కష్టాలు తీరి శుభం కలగాలని కోరుకున్నాని తెలిపారు.

Wednesday, December 23, 2020

AP CM YSJagan reached idupulapaya 3 days tour in Kadapa district

ఇడుపులపాయ చేరుకున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గురువారం శంకుస్థాపనలు చేయనున్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలీకాప్టర్‌ ద్వారా ఇడుపులపాయకు వెళ్లారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు. రూ.3115 కోట్లతో గండికోట-సీబీఆర్గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీంకు శంకుస్థాపనరూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్‌ పనుల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 

Tuesday, December 22, 2020

Senior IAS Officer Adityanath Das become Andhra Pradesh New Chief Secretary

ఏపీ కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రధానకార్యదర్శి (సీఎస్‌)గా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారిణి తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి బదిలీ అయివచ్చిన శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ కార్యదర్శిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీతను  ప్రభుత్వం నియమించింది. సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ ఈనెల 31న బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీ విరమిణ పొందనున్న ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ముఖ్యమంత్రి ప్రిన్సిపిల్ అడ్వైజర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. తాజా సీఎస్ రేసులోకి పలువురు వచ్చినా వారంతా సెంట్రల్ సర్వీసులో ఉండడంతో 1987 బిహార్‌ బ్యాచ్‌కు చెందిన ఆదిత్యనాథ్‌ దాస్‌ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Monday, December 21, 2020

YSRCP MLA RK Roja Adopts Orphan Girl to Fulfil Her Ambition to Become A Doctor

సీఎం జగన్ కు రోజా అరుదైన కానుక

https://youtu.be/mTc8ZMg6m-M

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు ఆ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా అరుదైన కానుక ఇచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి పుట్టినరోజు కాగా రోజా ఈ రోజు ఓ అనాథ బాలికను దత్తత తీసుకున్నారు. అమ్మఒడి పథకం స్ఫూర్తితో ఆమె ముందుకు వచ్చారు. ఆడపిల్లల్ని చదివించాలనే ఆశయంతో పేద విద్యార్థిని దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో చదువుకుంటున్న పుష్ప కుమారిని రోజా అక్కున చేర్చుకున్నారు. ఆ బాలికకు మెడిసిన్ చేయాలని ఉందనే విషయాన్ని గర్ల్స్ హోమ్ నిర్వాహకులు రోజా దృష్టికి తీసుకొచ్చారు. దాంతో రోజా బాలిక వైద్య విద్యకయ్యే మొత్తం ఖర్చును తను భరిస్తానని ప్రకటించారు.