ఇడుపులపాయ చేరుకున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గురువారం శంకుస్థాపనలు చేయనున్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలీకాప్టర్ ద్వారా ఇడుపులపాయకు వెళ్లారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్ అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు. రూ.3115 కోట్లతో గండికోట-సీబీఆర్, గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీంకు శంకుస్థాపన, రూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్ పనుల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
No comments:
Post a Comment