వైకుంఠాన్ని తలపిస్తున్న
తిరుమల
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం అభిషేకం అనంతరం ఆలయ ఆర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభం కాగా.. సామాన్య భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం క్యూకట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. దాంతో తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తోంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తదితరులు ఉన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వారంలో నడవటం స్వర్గంలో నడిచినట్లుందన్నారు. 2021లో అందరి కష్టాలు తీరి శుభం కలగాలని కోరుకున్నాని తెలిపారు.
No comments:
Post a Comment