Monday, December 21, 2020

YSRCP MLA RK Roja Adopts Orphan Girl to Fulfil Her Ambition to Become A Doctor

సీఎం జగన్ కు రోజా అరుదైన కానుక

https://youtu.be/mTc8ZMg6m-M

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు ఆ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా అరుదైన కానుక ఇచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి పుట్టినరోజు కాగా రోజా ఈ రోజు ఓ అనాథ బాలికను దత్తత తీసుకున్నారు. అమ్మఒడి పథకం స్ఫూర్తితో ఆమె ముందుకు వచ్చారు. ఆడపిల్లల్ని చదివించాలనే ఆశయంతో పేద విద్యార్థిని దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో చదువుకుంటున్న పుష్ప కుమారిని రోజా అక్కున చేర్చుకున్నారు. ఆ బాలికకు మెడిసిన్ చేయాలని ఉందనే విషయాన్ని గర్ల్స్ హోమ్ నిర్వాహకులు రోజా దృష్టికి తీసుకొచ్చారు. దాంతో రోజా బాలిక వైద్య విద్యకయ్యే మొత్తం ఖర్చును తను భరిస్తానని ప్రకటించారు.

Sunday, December 20, 2020

Boyapati designs two powerful roles for Balakrishna

జిల్లా కలెక్టర్ గా బాలకృష్ణ

బాలకృష్ణ ఇంతకుముందు చేయని పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి జిల్లా కలెక్టర్ గా బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో అభిమానుల్ని అలరించనున్నాడు. పదేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ జోడీ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో మూడో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ ల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ చిత్రంలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నాడు. రెండు పాత్రలూ పవర్ ఫుల్ గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇందులో పోరాట సన్నివేశాలు కొత్తతరహాలో ఉంటాయట. యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన బోయపాటి ఈ సినిమాకి ఫాంటసీ కూడా జోడిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. `సమరసింహారెడ్డి` ఫేమ్ అలనాటి సూపర్ హీరోయిన్ సిమ్రాన్ ప్రత్యేక పాత్రలో ఈ చిత్రంలో కనిపించనుందట.

Saturday, December 19, 2020

Hectic cold waves in north India

ఉత్తరాదిలో చలి పంజా

ఉత్తర భారతదేశంలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. శీతల గాలులకు జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా సిమ్లా, కశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది.  ఢిల్లీలో కూడా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నవెూదవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అత్యల్ప డిగ్రీలు ఉష్ణోగ్రతల నమోదులో సిమ్లాతో పోటీపడుతోంది. ఢిల్లీలోని జాఫర్‌పూర్‌లో సాధారణం కన్నా 6 డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అదేవిధంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోయి గత పదేళ్ల నాటి రికార్డులను బద్దలు కొట్టాయి. ఇక్కడ 0.4 డిగ్రీల ఉష్ణోగ్రత నవెూదైంది. జలంధర్‌లో 1.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బీహార్‌ లోనూ  4 డిగ్రీలకు కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజస్థాన్‌లో గడచిన 24 గంటల్లో అనేక నగరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నవెూదయ్యాయి. మౌంట్‌ అబూ, చందన్‌ తదితర ప్రాంతాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.

Friday, December 18, 2020

Nithyananda, absconding rape accused, announces visa for Kailasa, flights from Australia

కైలాస దేశానికి నిత్యానంద ఆహ్వానం

   ·   వీసాకు kailaasa.org లో సంప్రదించొచ్చు

`కైలాస` పేరుతో ఏకంగా దేశాన్నే ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వివాదాస్పద నిత్యానందస్వామి తాజాగా వీసా ఆహ్వానంతో తెరముందుకు వచ్చారు. ఈ ఏడాది వినాయకచవితి రోజున తమ దేశంలో రిజర్వుబ్యాంక్ ను కూడా ఏర్పాటు చేసినట్లు స్వాములవారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్కడుందో తెలియని దేశానికి హిందూమత ప్రేమికులకు వీసా ఇస్తామంటూ ఆహ్వానం పలికారు. ఆస్ట్రేలియా వరకు సొంత ఖర్చులతో వచ్చిన వారిని తామే స్వయంగా సకల లాంఛనాలతో తమ దేశంలోకి తీసుకుపోతామన్నారు. పరమశివుని సందర్శించడానికి అనుమతిస్తామని సెలవిచ్చారు. అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నిత్యానందస్వామి ఏడాదిగా పరారీలో ఉన్నారు. ఓ దివిలో తలదాచుకుంటున్న స్వామి ఆకస్మికంగా కైలాస పేరుతో ఓ దేశాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు.  ఇందులో ఆరోగ్య శాఖ, రాష్ట్ర విభాగం, సాంకేతిక విభాగం, జ్ఞానోదయ నాగరికత విభాగం, విద్యా శాఖ, మానవ సేవల విభాగం, హౌసింగ్ విభాగం, వాణిజ్య విభాగం, ఖజానా విభాగం ఉన్నాయని వివరించారు. రిషభ ధ్వజ- కైలాస జెండాలో నిత్యానందతో పాటు దేశ జాతీయ జంతువు నంది కూడా ఉంది. కైలాస దేశానికి వెళ్లగోరే వారు kailaasa.org లో సంప్రదించొచ్చునట.