ఉత్తరాదిలో చలి పంజా
ఉత్తర భారతదేశంలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ చలిగాలుల తీవ్రత
పెరుగుతోంది. శీతల గాలులకు జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా సిమ్లా, కశ్మీర్‌లో భారీగా మంచు
కురుస్తోంది. ఢిల్లీలో కూడా అత్యంత కనిష్ట
ఉష్ణోగ్రతలు నవెూదవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అత్యల్ప డిగ్రీలు ఉష్ణోగ్రతల
నమోదులో సిమ్లాతో పోటీపడుతోంది. ఢిల్లీలోని జాఫర్‌పూర్‌లో సాధారణం కన్నా 6 డిగ్రీల దిగువకు
ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అదేవిధంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉష్ణోగ్రతలు
అత్యంత కనిష్ఠానికి పడిపోయి గత పదేళ్ల నాటి రికార్డులను బద్దలు కొట్టాయి. ఇక్కడ 0.4 డిగ్రీల ఉష్ణోగ్రత
నవెూదైంది. జలంధర్‌లో 1.6
డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బీహార్ లోనూ
4 డిగ్రీలకు కనిష్ఠానికి
ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజస్థాన్‌లో గడచిన 24 గంటల్లో అనేక నగరాల్లో
అత్యల్ప ఉష్ణోగ్రతలు నవెూదయ్యాయి. మౌంట్ అబూ, చందన్ తదితర ప్రాంతాల్లో
మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.
No comments:
Post a Comment