జిల్లా కలెక్టర్ గా బాలకృష్ణ
బాలకృష్ణ ఇంతకుముందు చేయని
పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి జిల్లా కలెక్టర్ గా బాలయ్య
పవర్ ఫుల్ పాత్రలో అభిమానుల్ని అలరించనున్నాడు. పదేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ జోడీ
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో మూడో చిత్రం తెరకెక్కుతున్న
సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ ల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నాడు.
రెండు పాత్రలూ పవర్ ఫుల్ గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ లో
తాజా షెడ్యూల్ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.
ఇందులో పోరాట సన్నివేశాలు కొత్తతరహాలో ఉంటాయట. యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో
దిట్ట అయిన బోయపాటి ఈ సినిమాకి ఫాంటసీ కూడా జోడిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో
బాలయ్యకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్, పూర్ణ
నటిస్తున్నారు. `సమరసింహారెడ్డి` ఫేమ్ అలనాటి సూపర్ హీరోయిన్ సిమ్రాన్ ప్రత్యేక
పాత్రలో ఈ చిత్రంలో కనిపించనుందట.
No comments:
Post a Comment