త్వరలో విష్ణు విశాల్ తో గుత్తా జ్వాల పెళ్లి
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల తన పెళ్లి వార్తను ధ్రువీకరించింది. దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు విష్ణు విశాల్‌తో ఆమె గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆమె తమ ఫోటోలను షేర్ చేసి సంచలన సృష్టించింది. త్వరలోనే తామిద్దరం పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గుత్తా జ్వాల ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో `లాక్డౌన్ సందర్భంగా నిన్ను మిస్ అవుతున్నా`అంటూ విశాల్ నుద్దేశించి పేర్కొంది. అందుకు బదులుగా విశాల్ `సామాజిక దూరం అందరూ ఇప్పుడు పాటించాలి కదా` అని రీ ట్వీట్ చేశాడు. త్వరలోనే కరోనా మహమ్మారి కూడా దూరం కావాలని ఆకాంక్షించాడు. ఇదిలావుంటే జ్వాలకు గతంలోనే వివాహం అయిన విషయం విదితమే. తొలుత బాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. అలాగే విశాల్ కూడా గతంలోనే తన భార్యకు విడాకులు ఇచ్చాడు.