ఆరేళ్ల బాలికపై
అత్యాచారం ముగ్గురు బాలురపై కేసు నమోదు
ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది.
ఆరేళ్ల బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు. ఈ ఘోరం ఆగస్ట్ 20 మంగళవారం
జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. కమట్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రభుత్వ
పాఠశాలలో బాలిక ఒకటో తరగతి చదువుతోంది.
బాలికను పాఠశాల బాత్రూమ్ లోకి తీసుకెళ్లిన ముగ్గురు బాలురు లైంగికంగా
వేధించారు. వీరిలో ఒక బాలుడు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలురు అందరూ 10 ఏళ్ల వారే కావడం
గమనార్హం. ఈ ఘటనను గమనించిన ఉపాధ్యాయిని పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి
తీసుకువచ్చారు. బాధిత బాలిక సహా ముగ్గురు
బాలుర్ని ఆయన వద్దకు తరలించారు. తర్వాత తల్లిదండ్రుల్నిపిలిపించి బాలికను
అప్పగించారు. గురువారం రాత్రి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణానికి
పాల్పడిన ముగ్గురు బాలురపై బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో-ఐపీసీ సెక్షన్ 4)
కింద కేసులు నమోదు చేశారు. బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బాలల
సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఘటన
వివరాల్ని నమోదు చేశారు. బాలికను లైంగికంగా వేధించినందుకు గాను ఇద్దరిపై సెక్షన్-354/ఎ కింద, అత్యాచారం చేసిన బాలుడిపై సెక్షన్-376 ప్రకారం కేసులు నమోదు చేశారు. అయితే ఇంకా పోలీసులు వీరిని అదుపులోకి
తీసుకోలేదని సమాచారం.