టుస్సాడ్స్ మ్యూజియంలో బర్గర్ బొమ్మ
జీవకళ ఉట్టిపడేలా మైనపు బొమ్మల్ని రూపొందించి ప్రదర్శించే టుస్సాడ్స్ మ్యూజియంలో
కొత్త స్టార్ కొలువుదీరాడు. స్టార్ అంటే హాలీవుడ్,
బాలీవుడ్, టాలీవుడో లేదంటే ఏ స్పోర్ట్స్ స్టార్ కాదండోయ్.. స్టార్లతో పాటు వారూవీరు అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా ఆరగించే బర్గర్.. ఈసారి టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన కొత్త స్టార్. కె.ఎఫ్.సి. బర్గర్ ను మైనంతో రూపొందించి ఢిల్లీలోని
మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. తినే బర్గర్ కంటే ఈ టుస్సాడ్స్ (మైనపు) బర్గర్ సైజులో
1.5 రెట్లు పెద్దది. అల్లపు రుచితో ప్రపంచవ్యాప్తంగా నోరూరిస్తున్న తమ జింజర్ బర్గర్
ప్రపంచ ప్రసిద్ధ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరడం పట్ల కె.ఎఫ్.సి. ఇండియా మార్కెటింగ్
ఆఫీసర్ మోక్ష్ చోప్రా సంతోషం వ్యక్తం చేశారు. కె.ఎఫ్.సి. జింజర్ బర్గర్ కు టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం దక్కి ఓ సెలబ్రెటీ స్టేటస్ పొందడం తమను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందన్నారు.
అంతరిక్షంలోకి కూడా వెళ్లిన ఏకైక బర్గర్ తమదేనని
ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ట్యాటూ (పచ్చబొట్టు) గా తమ బర్గర్ ను పలువురు
ముద్రించుకోవడం తెలిసిందేనన్నారు. కె.ఎఫ్.సి. సంస్థ తమ ఉత్పత్తుల ప్రచారాన్ని
ఎల్లలు దాటించడంలో భాగంగా జింజర్ బర్గర్ ను 2017లో అంతరిక్షంలోకి పంపించింది.
No comments:
Post a Comment