ఘనంగా రాజీవ్ గాంధీ 75వ జయంతి
భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ
75వ జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పలువురు
నాయకులు ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. సోనియాగాంధీ,
మన్మోహన్ సింగ్, రాహుల్, ప్రియాంక, కూతురు మిరయా, కొడుకు రేహన్, భర్త రాబర్ట్ వాద్రా
పుష్పాంజలి ఘటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ,
గులాంనబీ అజాద్ తదితర నాయకులు వీర్ భూమికి చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. రాహుల్ గాంధీ ఈ సందర్భంగా
ట్వీట్ చేస్తూ తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా
కాంగ్రెస్ శ్రేణులు వారం రోజుల పాటు స్మారక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రియతమ
నేత రాజీవ్ గాంధీ సమాచార సాంకేతిక విప్లవానికి నాంది పలికారంటూ సంబంధిత వీడియోను రాహుల్ గాంధీ
ట్విటర్ లో పోస్ట్ చేశారు.
No comments:
Post a Comment