అవును..మోదీజీ..అవినీతిని దేశం సహించదు: ప్రియాంక
ప్రధాని మోదీ తన తండ్రి రాజీవ్ గాంధీపై చేసిన
వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ తిప్పికొట్టారు. రాజీవ్
గాంధీ అవినీతి నంబర్.1 నేత గానే చనిపోయారంటూ మోదీ ఉత్తరప్రదేశ్ ప్రతాప్ గఢ్ ఎన్నికల
ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక మండిపడ్డారు. అమేథి నుంచి మరోసారి మీకు ఎన్నికల
ఫలితాల రూపంలో గుణపాఠం వెలువడుతుందన్నారు. తన తండ్రి గురించి దేశానికి, అమేథి
ప్రజలకు బాగా తెలుసని ఎన్నోసార్లు ఓటు రూపంలో ప్రజలు విశ్వాసాన్ని ప్రకటించారని
గుర్తు చేశారు. దివంగత నేతని ఆయన త్యాగాన్ని మోదీ హేళన చేసి మాట్లాడారని ట్విటర్
లో పేర్కొన్నారు. తన తండ్రి రాజీవ్ అమాయకులని, ఎంతో నిజాయతీ పరులని ఆయనపై మోదీ అసంబద్ధమైన,
నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.