రాహుల్ విమానంలో సాంకేతిక లోపంపై విచారణ
ఎన్నికల
ప్రచారానికి బయలుదేరిన రాహుల్ విమానం సాంకేతిక లోపం తలెత్తడంతో ఢిల్లీ తిరిగి
వచ్చారు. శుక్రవారం (ఏప్రిల్26) ఉదయం 10.20కి రాహుల్ ఢిల్లీ నుంచి హాకర్ 850
ఎక్స్.పి. (వి.టి-కె.ఎన్.బి) విమానంలో బయలుదేరారు.
గాల్లోకి లేచిన కొన్ని నిమిషాల్లో ఇంజిన్ లో ఇబ్బందిని గుర్తించిన పైలట్లు
విషయాన్ని రాహుల్ కు తెలిపి విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించారు. ఈ సాంకేతిక
లోపం పై పౌర విమానాయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించారు. విధి
విధానాల్లో భాగంగానే ఈ దర్యాప్తునకు ఆదేశించినట్లు డీజీసీఏ వర్గాలు పేర్కొన్నాయి. 2018 ఏప్రిల్లో కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారానికి
రాహుల్ వెళ్లిన సందర్భంలో హుబ్లీలో ఆయన విమానం ల్యాండ్ కావడానికి 20 సెకన్లు
ఆలస్యమయింది. ఫాల్కన్ విమానంలో గతేడాది ఆయన ప్రయాణిస్తుండగా ఆకాశంలో 8000 అడుగుల
ఎత్తులో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. వాస్తవానికి ఆ సెకన్ల వ్యవధి కూడా విమాన
పెను ప్రమాదానికి సంకేతం కాగలదు. అప్పుడూ ఆ సాంకేతిక లోపంపై దర్యాప్తు
నిర్వహించారు. మరో వైపు తాజా ఇంజన్ లోపానికి సంబంధించి రాహుల్ ట్విట్ చేశారు. తన
కోసం ప్రజలు వేచి చూస్తుంటారు కాబట్టి వారికి అసౌకర్యం కల్గకుండా జరిగిన విషయాన్ని
తెల్పుతూ ట్విట్ చేయాల్సిందిగా విమానం లోని పార్టీ నాయకుల్ని ఆదేశించారు.