ఏదోక రోజు హాలివుడ్ కు వెళ్తా..ఆలియా భట్
దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమా షూటింగ్ లో
త్వరలో పాల్గొననున్న బాలివుడ్ అందాల బామ ఆలియా భట్ ఏదోక రోజు తను హాలివుడ్
సినిమాల్లో నటిస్తానని తెలిపింది. తెలుగులో తొలిసారిగా కనిపించనున్న ఈ 26ఏళ్ల లిటిల్
స్టార్ త్వరలోనే ఒకరోజు ఆంగ్ల చిత్రంలో నటిస్తానంది. ఆమె బాలివుడ్ లోకి
అడుగుపెట్టి ఏడేళ్లే అయింది. అయితే హాలివుడ్ పూర్తిగా కొత్త పరిశ్రమ కావడం వల్ల అక్కడ
నటించడం అంత తేలికైన విషయమేమి కాదని చెప్పింది. తనకు ఇంకా చాలా కెరీర్
ముందున్నందున ఎప్పుడో ఒకప్పుడు మాత్రం హాలివుడ్ మూవీ చేస్తానని ఆలియా ధీమా
వెలిబుచ్చింది. ఆలియా ప్రస్తుతం బాలివుడ్ లో ‘కళంక్’, సోగ్గాడు రణబీర్ కపూర్ తో
కలిసి ‘బ్రహ్మాస్త్ర’, సంజయ్ లీలా బన్సాలీ చిత్రం ‘ఇన్షాల్లా’లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తోంది.